గొర్రె పిల్లల పోషణ :
గొర్రె పిల్లల్లో పెరుగుదల మొదటి మూడు మాసాల్లో వుంటుంది. ఈ కాలం లో పెరుగుదల రోజుకు దాదాపు 150 గ్రా. చొప్పున ఉంటుంది. ఇలా అధిక పెరుగుదల ఉన్న గొర్రె పిల్లలే ముందు ముందు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ బరువు తూగి లాభాలు చేకూరుస్తాయి. కావున పాలు మరిచే వయస్సు వరకు(దాదాపుగా మూడునెలలు) తల్లి పాలకు అదనంగా పోషణ ఇవ్వాలి. పిల్ల గొర్రెలను తల్లుల నుండి వేరు దడిలోఉంచి పెంచాలి. పిల్లల దడిలో వేపకొమ్మలు వేలాడకట్టిన ఎడల, పిల్లలు నివాసంగా ఆకు తింటూ అవి జీర్ణించుకోవటానికి అలవాటు పడుతాయి. అదే విధంగా సులువుగా జీర్ణమయ్యే పిల్లల దాణా తొట్టిలో ఉంచిన ఎడల పిల్లల దానాకి అలవాటు పడుతాయి. పిల్లలకు ఇచ్చే దాణా సులువుగా జీర్ణమై అధిక శక్తిని మరియు కావలసిన ఇతర పోషక పదార్థాలను పిల్లలకు సమకూరుస్తుంది.